Malayalam Actor Siddique | రేవతి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది : నటుడు సిద్ధిఖీ
Malayalam Actor Siddique | మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam Movie Artists (AMMA)కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సీనియర్ నటుడు సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తనను రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ సిద్ధిఖీపై ఆరోపణలు చేసింది.
Malayalam Actor Siddique | మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Association of Malayalam Movie Artists (AMMA)కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సీనియర్ నటుడు సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తనను రేప్ చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ సిద్ధిఖీపై ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పదవికి రాజీనామా చేసి ఆదివారం తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశాడు. తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే తాను ఈ పదవి నుంచి వైదొలుగుతున్నానని, ఈ పరిస్థితిలో పదవిలో కొనసాగడం సరికాదని ఆయన ధృవీకరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత స్పందిస్తానని సిద్ధిక్ తెలిపారు.
అయితే రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలపై నటుడు సిద్ధిఖీ (Siddique) కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలను చేస్తుందని కావాలని తన పరువు, మర్యాదలకు భంగం కలిగిస్తుందని.. ఆమె కుట్రలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. సిద్ధిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ రేవతి సంపత్ ఆరోపించింది. ఒక సినిమా గురించి సిద్ధిఖీ వద్దకు వెళ్లినప్పుడు నాపై అత్యచారం చేశాడు. తనతో పాటు తన స్నేహితులను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాడు అంటూ రేవతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది.
అయితే ఈ రిపోర్ట్‌కు సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గత శుక్రవారం ఓ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను సహించేది లేదని, బాధితులకు అసోసియేషన్ అండగా ఉంటుందని జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ పేర్కొన్నాడు. అయితే అతడు ప్రకటించిన తర్వాతి రోజే అతడిపైన కూడా ఆరోపణలు రావడం గమనార్హం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI Technology | చాట్‌జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
Sabarimala | శబరిమల ప్రసాదం ఇంటికే డెలివరీ
Ramayana | రామాయణ బాక్సాఫీస్ విధ్వంసం.. 10వ రోజు కూడా తగ్గని జోరు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల వసూళ్లు!
Bhushan Bara | చదివిస్తానని ఇంటికి తెచ్చి కడుపు చేసిన ఎమ్మెల్యే.. జార్ఖండ్‌లో గిరిజన బాలికపై ఘాతుకం!
Promotions | ఏవో టు ఏడీ ఉద్యోగోన్నతుల్లో గోల్మాల్.. డీహెచ్‌లో ఇద్దరు ఏడీల దందా!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

