Malavika Mohanan | బెడ్ సీన్పై నెటీజన్ ప్రశ్న.. ఘాటు రిప్లై ఇచ్చిన మాళవిక!
Malavika Mohanan | వినూత్న పాత్రలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి మాళవికా మోహనన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఘాటైన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును మాయలో పడేస్తుంది. ‘పేట’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ సుందరి.. ‘మాస్టర్’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె హిందీలో ‘యుద్ర’ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె సోషల్ మీడియాలో ‘క్వశ్చన్ ఆండ్ ఆన్సర్’ సెషన్ నిర్వహించింది.
ఈ క్రమంలో నెటీజన్లు పలు ప్రశ్నలు అడుగగా, మాళవికా ఆన్సర్స్ చేసింది. అయితే ఓ నెటీజన్ ‘మారన్ సినిమాలోని బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశారు’ అని క్వశ్చన్ అడిగాడు. దానికి మాళవిక స్పందిస్తూ ‘నీ తల లోపలి భాగం ఏదో పడైనట్టుంది’ అని ఘాటు రిప్లై ఇచ్చింది. దీనిపై కొందరు నెటీజన్లు సూపర్ రిప్లై అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈమె ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కునున్న ‘రాజా డిలక్స్’లో హీరోయిన్గా ఫిక్సయిందని గతం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Malavika Mohan
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

