ఉస్తాద్ వచ్చేది ఆరోజేనా?
గత ఏడాది ‘ఓజీ’తో అభిమానుల్లో జోష్ నింపారు అగ్ర హీరో పవన్‌కల్యాణ్. ఆయన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్' వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాట రికార్డు స్థాయి వీక్షణలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
గత ఏడాది ‘ఓజీ’తో అభిమానుల్లో జోష్ నింపారు అగ్ర హీరో పవన్‌కల్యాణ్. ఆయన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాట రికార్డు స్థాయి వీక్షణలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్‌కల్యాణ్-దర్శకుడు హరీష్‌శంకర్ కాంబో సినిమా ఇదే కావడం కూడా సెంటిమెంట్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
ఏప్రిల్ 23 లేదా 24న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. సమ్మర్ సీజన్లో అదే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్‌గా భావిస్తున్నారట. త్వరలో ఈ విషయమై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంలో పవన్‌కల్యాణ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఆనంద్‌సాయి, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

