Mahesh Babu | మహేష్ బాబు లగ్జరీ రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రూ.299, బిర్యానీ ధర చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
Mahesh Babu | వెండితెరపై స్టార్డమ్తో అభిమానులను ఆకట్టుకునే సినీ ప్రముఖులు ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. సినిమాలతో పాటు మల్టీప్లెక్సులు, రియల్ ఎస్టేట్, దుస్తుల బ్రాండ్లు, హోటల్ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ కొత్త వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ రెస్టారెంట్ రంగంపై సినీ తారలు ఎక్కువ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.
Mahesh Babu | వెండితెరపై స్టార్డమ్తో అభిమానులను ఆకట్టుకునే సినీ ప్రముఖులు ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. సినిమాలతో పాటు మల్టీప్లెక్సులు, రియల్ ఎస్టేట్, దుస్తుల బ్రాండ్లు, హోటల్ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ కొత్త వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ రెస్టారెంట్ రంగంపై సినీ తారలు ఎక్కువ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందువరుసలో ఉంటారు.ఇప్పటికే ఏషియన్ గ్రూప్‌తో కలిసి AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న మహేష్ బాబు, తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి రెస్టారెంట్ రంగంలో కూడా అడుగుపెట్టారు. ‘AN Restaurants’ పేరుతో లగ్జరీ ఫుడ్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. ప్రముఖ రెస్టారెంట్ బ్రాండ్ మినర్వా కాఫీ షాప్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఈ లగ్జరీ డైనింగ్ అనుభవాన్ని అందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ ఫుడ్ బ్లాగర్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లోని AVN ప్యాలెస్ హైట్స్‌లో ఉన్న రెస్టారెంట్‌ను సందర్శించి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. హోటల్ అంబియన్స్‌ను చూసి ఆయన ప్రశంసలు కురిపించారు. ప్యాలెస్ తరహాలో నిర్మించిన ఇంటీరియర్, రాయల్ ఫీలింగ్, ఫుడ్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఫుడ్ రేట్లు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. బయట మార్కెట్లో రూ.20కి లభించే సాధారణ వాటర్ బాటిల్ ధర ఈ రెస్టారెంట్లో రూ.299గా ఉండగా, సాధారణంగా రూ.40 ఉండే డైట్ కోక్ క్యాన్ ధర రూ.180గా మెనూలో కనిపించింది. ఈ ధరలు చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బ్లాగర్ ఆర్డర్ చేసిన ఫుడ్ విషయానికి వస్తే.. ఒక చికెన్ టిక్కా స్టార్టర్ (రూ.725), ఒక మటన్ బిర్యానీ (రూ.600), రెండు డైట్ కోక్స్ (రూ.360) ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ట్యాక్స్‌లు, సర్వీస్ ఛార్జీలు కలిపి మొత్తం బిల్లు రూ.1,853కు చేరినట్లు వెల్లడించారు. అయితే భారీ ధరలు ఉన్నప్పటికీ ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందని బ్లాగర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మటన్ బిర్యానీ హైదరాబాద్‌లోనే బెస్ట్లలో ఒకటిగా అనిపించిందని వ్యాఖ్యానించారు. వీడియో వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కామెంట్ల వరద మొదలైంది. “ఆ డబ్బులతో రెండు కేజీల మటన్ కొనుక్కొని ఇంట్లోనే వండుకుని తింటాం” అంటూ కొందరు సరదా వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు “ఇది పూర్తిగా ఓవర్‌ప్రైస్డ్” అని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు అభిమానులు మాత్రం స్టార్ హోటల్స్‌లో లగ్జరీ, అంబియన్స్, సేవల కోసం కూడా చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ రెస్టారెంట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

