Mahesh Babu | మహేశ్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం… బిజినెస్‌మేన్ రీరిలీజ్ వేళ థియేటర్ ముందు బైక్ దగ్ధం
Mahesh Babu | మహేశ్ బాబు నటించిన ‘బిజినెస్‌మేన్’ సినిమా నవంబర్ 29న రీరిలీజ్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా అభిమానుల్లో సంబరాలు మునిగితేలుతున్నారు. అయితే ఈ ఉత్సాహం కొన్నిచోట్ల ప్రమాదాలకు దారితీస్తోంది. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదుట ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
Mahesh Babu | మహేశ్ బాబు నటించిన ‘బిజినెస్‌మేన్’ సినిమా నవంబర్ 29న రీరిలీజ్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా అభిమానుల్లో సంబరాలు మునిగితేలుతున్నారు. అయితే ఈ ఉత్సాహం కొన్నిచోట్ల ప్రమాదాలకు దారితీస్తోంది. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఎదుట ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సినిమా రీరిలీజ్ సందర్బంగా థియేటర్ ఎదుట భారీగా గుమికూడిన మహేశ్ అభిమానులు అత్యంత ఉత్సాహంతో హంగామా చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడంతో పాటు, కొంతమంది యువకులు తమ బైకులను ఎక్సలేటర్ పెంచుతూ రౌండ్లు వేయడం ప్రారంభించారు.
ఈ అత్యుత్సాహ ప్రదర్శనలో ఒక బైక్ అధిక వేడిని తట్టుకోలేక అకస్మాత్తుగా మంటలు అంటుకుంది. చూస్తుండగానే మంటలు ఎక్కువయ్యాయి. స్థానికులు, ఫ్యాన్స్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ బైక్ పూర్తిగా కాలింది. కొన్ని నిమిషాల్లోనే ఆ బైక్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ థియేటర్ ఎదుట ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ప్రమాదాలు తప్పవని, ప్రజా ప్రదేశాల్లో స్టంట్లు చేయరాదని సూచించారు.
బిజినెస్‌మేన్ రీరిలీజ్ దేశవ్యాప్తంగా భారీ హంగామాతో జరిగింది. మహేశ్ బాబు పట్ల అభిమానులు చూపే ప్రేమ అందరికీ తెలిసినదే. కానీ ఇలాంటి ప్రమాదాలు ఆ పూర్తి సంబరాల మూడ్‌ను చెడగొడతాయి. తాజా సంఘటనతో పోలీసులు థియేటర్ల వద్ద భద్రత చర్యలు మరింత పెంచారు.కాగా, మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ ఇప్పటికే పలుమార్లు రిలీజ్ అయింది.ప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ అయింది. అప్పుడే ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. మరోసారి ఈ మూవీ ని రీ రిలీజ్ చేస్తే పెద్ద స్థాయి కలెక్షన్లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టలేదు అని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్. కానీ ఈ సినిమా రీ రీ రిలీజ్ లో అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపిస్తుంది. అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. దీనితో మహేష్ బాబు స్టామినా ఏమిటి అనేది మరొకసారి స్పష్టంగా తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

