Guntur kaaram | గుంటూరు కారం నుంచి దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్
Guntur kaaram| టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గుంటూరు కారం నుంచి దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
Guntur kaaram| టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గుంటూరు కారం నుంచి దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
థమన్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్‌తో సాగుతున్న ఈ పాట సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి అభిమానులు కోరుకుంటున్న మాస్ ఎలిమెంట్స్‌తో సాగనున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. రామజోగయ్య రాసిన ఈ పాటను సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ పాడారు. తాజాగా మహేశ్‌బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ, జగపతిబాబుపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ సినిమాలో మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

