Lucifer-2 Movie | బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ రెడీ.. ఈ సారి మరింత పొలిటికల్ టచ్..!
Lucifer-2 Movie | సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ వేరు. అయితే అటెన్షన్‌ను బ్యాలెన్స్ చేయడంలో చాలా సీక్వెల్స్ తడబడ్డాయి. ఒపెనింగ్స్ వరకు టైటిల్ పేరు పనికొస్తుంది కానీ.. లోపల మ్యాటర్ లేకపోతే సీక్వెల్‌కు కూడా తిప్పలు తప్పవు.
Lucifer-2 Movie | సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ వేరు. అయితే అటెన్షన్‌ను బ్యాలెన్స్ చేయడంలో చాలా సీక్వెల్స్ తడబడ్డాయి. ఒపెనింగ్స్ వరకు టైటిల్ పేరు పనికొస్తుంది కానీ.. లోపల మ్యాటర్ లేకపోతే సీక్వెల్‌కు కూడా తిప్పలు తప్పవు. కానీ ఈ సీక్వెల్ అలా కాదు, అసలు సీక్వెల్ అంటే ఏంటో చూపిస్తాం అంటూ వస్తుంది లూసీఫర్-2. నాలుగేళ్ల కిందట వచ్చిన లూసిఫర్ మలయాళంలో పెద్ద బ్లాక్ బస్టర్. మమ్ముట్టి కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో చిరు గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేయగా.. ఇక్కడ బెడిసి కొట్టింది.
పొలికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా ఆయనకది డైరెక్టర్‌గా డెబ్యూ సినిమా. తొలి సినిమాకే అలాంటి క్రిటికల్ సబ్జెక్ట్ ఎంచుకుని అరి వీర భయంకర హిట్టు కొట్టాడంటే మాములు విషయం కాదు. కాగా ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ముస్తాబవుతుంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ రాగా.. తాజాగా మేకర్స్ సినిమా షూటింగ్ అప్డేట్ను వెల్లడించారు. అక్టోబర్ 5 నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. తొలిపార్టులోని కొన్ని సీన్లును యాడ్ చేసి ట్రైలర్‌గా తీర్చి దిద్ది చివర్లో పార్ట్-2 అంటూ వెల్లడించారు.
పృథ్విరాజ్‌కు దర్శకుడిగా ఇది మూడో సినిమా. మూడు సినిమాల్లో మోహన్‌లాల్ ప్రధాన హీరోగా ఉండటం విశేషం. ఇక ఈ సీక్వెల్ సినిమాను డబ్బును మంచి నీళ్ళలా ఖర్చు పెట్టే లైకా సంస్థ టేకోవర్ చేసుకుంది. దాంటో అటు తమిళంలో కూడా ఈ సినిమాపై మంచి హైప్ వచ్చింది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

