Navdeep | నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం లవ్ మౌళి : నవదీప్
Navdeep | సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ (Navdeep) సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌళి (love mouli). ఈ విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి సి స్పేస్ తెరకెక్కిస్తోంది.
Navdeep | సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ (Navdeep) సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్ మౌళి (love mouli). ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి సి స్పేస్ తెరకెక్కిస్తోంది.
ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సార్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ.. అన్ని లాంగ్వేజ్‌లో రకరకాల కొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో తెలుగులో రాబోతున్న వైవిధ్యమన, విభిన్నమైన సినిమా ఇది. ప్రేక్షకులను
థియేటర్‌కు రప్పించే సినిమా ఇది. ప్రేక్షకులు థియేటర్‌కు ఎందుకు రావాలో అన్న ప్రశ్నకు ఈ చిత్రంలో సమాధానం దొరుకుతుంది. చిరపుంజి, మేఘాలయాలోని అందరమైన ప్రదేశాల్లో షూట్ చేసిన చిత్రమిది.
ఈ కథ విన్నప్పుడు అక్కడే చేయాలని అనిపించింది. ఎన్నో వ్యయ ప్రయసాలతో చిత్రీకరణ చేశాం. ఈ సినిమా ప్రొడక్షన్ ఎలా జరిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యొచ్చు. మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామనే నమ్మకం కలిగింది. ఇక సినిమా ఫలితం ఆడియన్స్ చేతిలో వుంది. కథ వినగానే నచ్చిన సినిమా ఇది. నా పర్సనల్ లైఫ్‌లో నా ప్రేమకథలు, నా లవ్‌స్టోరీల్లో వున్న పాయింట్‌ను టచ్ చేశాం. ఈ కథ, ఈ పాయింట్ కనెక్ట్ అయితే వాళ్ల పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని వుంది. ఈ 20 ఏళ్ల కెరీర్ తరువాత నాలో వున్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది.
దర్శకుడు అవనీంద్ర మాట్లాడుతూ.. ఇందులో నేటి యువతరానికి కావాల్సిన అంశాలున్నాయి. ఈ చిత్రంలో అందరికి రిలేట్ అయ్యే అంశాలు, కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ప్రేమలో వున్న వారి రిలేషన్స్ ఎలా వున్నాయి. నేటి యువతరం ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్రేకప్‌లు అవుతున్నాయి. కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్స్ నిలబడవా? అనే ప్రశ్నకు నాకు దొరికిన పరిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపెడుతున్నాం. ఈ సినిమా డీఐ కేరళలో జరుగుతున్నప్పుడు మంజుమ్మల్ బాయ్, ఆవేశం చిత్రాలకు పనిచేసిన కలరిస్ట్ మా సినిమాకు పనిచేస్తున్నప్పుడు సినిమా చూసి ఎంతో అభినందించాడు. ఆయన అందించిన ప్రశంసలు మరువలేనిది.
రేపు చిత్రం విడుదలైన తరువాత కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం నవదీప్ చాలా కష్టపడ్డాడు. ఆయన అందుకు తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.
నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్: నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం , సి స్పేస్
రచన-దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాటల రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

