vikram Movie | ఏడాది కిందట తమిళంలో విక్రమ్ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. లోకేష్ టేకింగ్‌కు, నటీనటుల పర్ఫార్మెన్స్కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. తమిళంలోనే కాదు తెలుగు సహా విడుదలైన ప్రతి భాషాలో కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. చేసింది నెగెటీవ్ రోలే అయినా.. జనాలకు బాగా నచ్చేసింది. సంతానంగా నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ఇక విజయ్‌కు కూడా ఈ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇదిలా ఉంటే ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి కంటే ముందు లోకేష్.. రాఘవ లారెన్స్‌ను సంప్రదించాడట. అయితే అప్పుడు తన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల అంత మంచి క్యారెక్టర్‌ను మిస్ చేసుకున్నానని లారెన్స్ ఇటీవలే ఓ సందర్భంలో వెల్లడించాడు. ఇక లారెన్స్ కూడా ఆ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్టయ్యేవాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం లారెన్స్ నటించిన రుద్రన్ మూవీ డిజాస్టర్ టాక్‌ను మూట గట్టుకుని కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఇక ఇప్పుడు ఆయన చేతిలో జిగార్తాండ-2తో పాటు, చంద్రముఖి-2, కాంచన-4లు ఉన్నాయి.