Lokesh Kanagaraj | లోకేశ్ కనగరాజ్ కీలక నిర్ణయం.. ఇకపై అలా చేయనంటున్న స్టార్ దర్శకుడు
G Squad Production | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ‘జి స్క్వాడ్’ (G Squad ) అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రోడక్షన్ హౌస్ నుంచి వచ్చే మొదటి సినిమా ఫైట్ క్లబ్ (FightClub).
G Squad Production | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ‘జి స్క్వాడ్’ (G Squad ) అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రోడక్షన్ హౌస్ నుంచి వచ్చే మొదటి సినిమా ఫైట్ క్లబ్ (FightClub). ఊరియాడి ఫేం విజయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ జరుగగా.. ముఖ్య అతిథిగా లోకేష్ వచ్చి సందడి చేశాడు. అయితే ఈ ఈవెంట్లో లోకోష్ మాట్లాడుతూ.. రిలీజ్ డేట్ ప్రెజర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘లియో’ సెకండ్ ఆఫ్ బాగా లేదని చాలామంది కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ను నేను తీసుకుంటున్నా. ఇకపై ఏదైనా సినిమాను ప్రకటిస్తే.. సినిమా ప్రారంభం కాగానే రిలీజ్ డేట్ను మాత్రం అనౌన్స్ చేయను. ఎందుకంటే.. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రెజర్ వలన అనుకున్న సన్నివేశాలను సరిగ్గా తీయలేము. అందుకే ఇకపై అలా చేయబోను అంటూ లోకేశ్ తెలిపారు.
హాలీవుడ్లో ‘ఫైట్ క్లబ్’ అనే సినిమాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్రాడ్పిట్ ముఖ్యపాత్రలో.. డేవిడ్ ఫించ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. స్పిల్ట్ పర్సనాలిటీని బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇది భారీ విజయాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం లోకేశ్ బ్యానర్లో వచ్చిన ఈ ఫైట్ క్లబ్ కూడా ఈ కథతోనే వస్తుందా లేదా వేరే స్టోరీనా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

