Leo Movie | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo.. Bloody Sweet). త్రిష హీరోయిన్గా నటిస్తుండగా.. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లియో మూవీ ట్రైలర్ కూడా గురువారం సాయంత్రం విడుదలై యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ ట్రైలర్ వల్ల చెన్నైలోని ఒక థియేటర్ నాశనం అయ్యింది.
వివరాల్లోకెళితే.. ‘లియో’ ట్రైలర్ గురువారం సాయంత్రం యూట్యూబ్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. మొదట ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాన్సిల్ అవ్వడంతో.. చెన్నైలోని కొన్ని థియేటర్లలో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఇక చెన్నైలో ఉన్న రోహిణి సిల్వర్స్క్రీన్స్లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించగా.. ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసిన విజయ్ అభిమానులు అనంతరం మితిమీరిన అత్యుత్సాహం. వికృత ప్రవర్తన కారణంగా థియేటర్లోని కుర్చీలను విరగొట్టారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rohini theatre damage after #LeoTrailer screening pic.twitter.com/9GFumTMbPf
— Star Talkies (@startalkies_ofl) October 5, 2023
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ లియో సినిమాకు యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. రెండు గంటల నలభై నిమిషాల రన్టైమ్తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఇక రన్ టైమ్ ఈ సినిమాకు కలిసొచ్చేలానే ఉంది.