Akhil: పూజా హెగ్డేతో అఖిల్ అదిరిపోయే రొమాన్స్.. లెహరాయి సాంగ్ విడుదల

అఖిల్ అక్కినేని మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటించింది. ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.
తాజాగా చిత్రం నుండి లెహరాయి అనే సాంగ్ విడుదల చేశారు.ఇందులో అఖిల్, పూజా హెగ్డే మధ్య రొమాన్స్ చూసి ప్రేక్షకులు ఫుల్ థ్రిల్‌గా ఫీలవుతున్నారు. శ్రీమణి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఈ పాట పాడారు. గోపి సుందర్ సంగీతం అందించారు. పాట శ్రోతలని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తన పేరుతోనే రూపొందిన ‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అఖిల్.. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాల్లో నటించాడు. ఇవి ఆయనకు సరైన సక్సెస్ అందించలేకపోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పక్కా హిట్ ఇస్తుందని విశ్వసిస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

