‘లక్ష్యసాధనలో గురితప్పిన తన జీవితాన్ని ఓ ఆర్చరీ ఆటగాడు ఎలా సరిదిద్దుకున్నాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్‌దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. నవంబర్ 12న సినిమా విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘పార్ధు అనే ఆర్చరీ ప్లేయర్ కథ ఇది. జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపును తెచ్చుకోవాలని అనుకున్న అతడి కలకు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నాగశౌర్య లుక్, నటన ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కోసం విలువిద్యలో ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు’ అని తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి.