దుమ్ము రేపుతున్న ఆచార్య లాహె లాహె సాంగ్

ఈ మధ్య కాలంలో మంచి ఆల్బమ్స్ రూపొందుతున్నాయి. ఇవి సినిమాలపై భారీ అంచనాలు పెంచడమే కాకుంఢా శ్రోతలని అలరిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణిశర్మ కాంబోలో వచ్చిన పలు సినిమాల మ్యూజిక్ ఆల్బమ్‌లు సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరు ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్నఆచార్య సినిమా నుండి కొద్ది రోజుల క్రితం లాహె లాహె అనే లిరికల్ సాంగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్ . ఈ పాట యూట్యూబ్‌లో దుమ్ము రేపుతుంది. ఏకంగా 80 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఈ పాట దూసుకు పోతోంది. ఈమధ్య కాలంలో ‘సారంగ దరియా…’ సాంగ్ తర్వాత అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న పాటగా ‘లాహె లాహె…’ నిలిచింది.
లాహె లాహె సాంగ్‌లో మెగాస్టార్ డ్యాన్స్ బిట్‌తో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత కాస్ట్యూమ్స్, డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాజల్ కూడా ఈ పాటలో మెరిసింది. పాట లిరిక్స్ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. శివ పార్వతులకు సంబంధించిన ఈ పాట చాలా పెద్ద అర్థాన్ని తెలిపే విధంగా ఉందంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా లాహె లాహె సాంగ్ అన్ని విధాలుగా బాగుండటంతో భారీ వ్యూస్‌ను దక్కించుకుంటోంది.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో చిరు, చరణ్‌లు నక్సలైట్లుగా కనిపించబోతున్నారని సమాచారం. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Acharya
- Chiranjeevi
- lahe lahe
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

