పుట్టగానే కేర్కేర్మని ఏడవకుండా.. చిరునవ్వులు చిందించిందేమో! ఆ పాలబుగ్గల్ని చూసి పరవశించిపోయి.. సుస్మిత అని పేరు పెట్టారు కన్నవారు. సినిమా పరిశ్రమ మాత్రం.. ఉరకలెత్తే ఉత్సాహానికి ఫిదా అయిపోయి ఖుషీ అని నామకరణం చేసింది. కన్నడ పరిశ్రమలో తానేమిటో నిరూపించుకున్నాక.. తెలుగు సీమలో అడుగుపెట్టింది. ‘పిండం’ చిత్రం తనకు బ్రహ్మాండమైన మైలేజీ ఇస్తుందని నమ్ముతున్నది ఖుషీ రవి.
సి.ఎం. ప్రవీణ్