కేటీఆర్ సర్.. నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను: దేవి శ్రీ

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియాలో యువ గాయని శ్రావణి టాలెంట్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసి సంగీత దర్శకులు థమన్, దేవి శ్రీ ప్రసాద్‌లని ట్యాగ్ చేశాడు. కేటీఆర్ ట్వీట్‌కి స్పందించిన దేవి శ్రీ .. శ్రావణి టాలెంట్‌కు ఫిదా అయ్యానని, భవిష్యత్తులో నిర్వహించే షోలలో కూడా శర్వాణికితప్పకుండా అవకాశం ఇస్తామని దేవి శ్రీ ప్రసాద్ అన్నాడు.
తాజాగా దేవి శ్రీ ప్రసాద్‌తో దిగిన ఫొటోలని షేర్ చేస్తూ.. కేటీఆర్ సర్ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. తమిళంలో నిర్వహిస్తున్న ‘స్టార్ టు రాక్ స్టార్’ కార్యక్రమంలో శర్వాణికి అవకాశం ఇచ్చాను . మెదక్ జిల్లాకు చెందిన ఆ ప్రతిభావంతురాలైన గాయని శర్వాణిని గుర్తించాం. ఆమెను విమానంలో చెన్నై తీసుకెళ్లాం. ‘స్టార్ టు రాక్ స్టార్’ కార్యక్రమంలో ఆమె ‘లైమ్ లైట్’ రౌండ్ లో పాల్గొంది. నిజంగానే ఆమె షేక్ చేసింది. ఈ ఎపిసోడ్ జీ తమిళ్ చానల్లో జులై 18 ఆదివారం నాడు రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది” అని వివరించారు. దీనికి స్పందించిన కేటీఆర్ మీ స్పందన అమోఘం అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
👏👏 Great gesture brother https://t.co/TTk3tMFFky
— KTR (@KTRBRS) July 16, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Devi Sri Prasad
- KTR
- sravani
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

