గణపత్ కోసం బైక్ విన్యాసాలు

హీరోపంటి (2014) చిత్రం ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేశారు యువహీరో టైగర్‌ష్రాఫ్, కథానాయిక కృతిసనన్. ఏడేళ్ల విరామం తర్వాత వీరిద్దరు కలిసి ‘గణపత్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తొలిసారి తన కెరీర్లో పోరాటఘట్టాల్లో భాగం కాబోతున్నానని చెప్పింది కృతిసనన్. ఇందుకోసం ఆమె బైక్ రైడింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుందట. కృతిసనన్ మాట్లాడుతూ “తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’ చిత్రంలో నేను బుల్లెట్‌ను నడిపాను. అయితే ‘గణపత్’లో మాత్రం డర్ట్‌బైక్ (పర్వత ప్రాంతాల్లో నడిపే ప్రత్యేకమైన బైక్) నడపడంలో శిక్షణ తీసుకుంటున్నా. త్వరలో హాలీవుడ్ తరహాలో నా మీద బైక్ విన్యాసాలను చిత్రీకరించబోతున్నారు. బాలీవుడ్లో యాక్షన్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న టైగర్ష్రాఫ్తో కలిసి పోరాటాల్లో పాలుపంచుకోవడం ఉత్సాహంగా అనిపిస్తోంది’ అని చెప్పింది. కొద్ది మసాల క్రితం డర్ట్‌బైక్ రైడ్ చేస్తున్న కృతిసనన్ పోస్టర్‌ను చిత్ర బృందం సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఈ చిత్రానికి వికాస్‌భల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కృతిసనన్ పాన్ఇండియా పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’లో ప్రభాస్ సరసన సీత పాత్రలో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

