Nenu Meeku Baga Kavalsinavadini Teaser | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ సినీరంగంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవలే ‘సమ్మతమే’ చిత్రంతో మరో హిట్‌ను సాధించాడు. ప్రస్తుతం కిరణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఒకటి. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ మొదలై నెలలు దాటుతున్న ఈ సినిమా గురించి అప్డేట్లు రావడంలేదు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా టీజర్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. జూలై 10న 11.05 నిమిషాలకు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో కిరణ్ గాగుల్స్ ధరించి స్టైలిష్‌లుక్‌లో ఉన్నాడు.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్నికోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్వ దీప్తి నిర్మిస్తున్నారు.
Mass unloading with entertainment 💥💥@Kiran_Abbavaram's #NMBKteaser releasing on July 10th at 11:05am 🔥#NenuMeekuBaagaKavalsinavaadini #NMBK@itssanjanaanand #SonuThakur @kodidivya @sridhar_chotu @KodiDivyaaEnt #Manisharma @LahariMusic pic.twitter.com/bQnYXh7RLw
— KodiDivyaaEntertainments (@KodiDivyaaEnt) July 7, 2022