తొలిప్రేమ తోపుకాదు..
గత ఏడాది ‘క’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
గత ఏడాది ‘క’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీగౌరీ ప్రియ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడు. సాయిరాజేష్ కథనందించడంతో పాటు ఎస్కేఎన్తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘తొలి ప్రేమేం తోపు కాదు.. ఫస్ట్‌లవ్ ఫెయిలయితేనే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుంది..’ అనే హీరో సంభాషణతో మొదలైన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. నాయకానాయికలు సముద్రపు ఒడ్డున కూర్చుని తొలి ప్రేమ గురించి మాట్లాడుకునే డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఈ సుదీర్ఘ జీవిత పయనంలో తొలిప్రేమ ఒక మజిలీ మాత్రమేనని, అదే చివరిది కాదనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతున్నది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: సాయిరాజేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి నంబూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

