Keerthy Suresh | డైరీతో బయటపడిన కీర్తి సురేష్ ప్రేమాయణం.. అమ్మ తగలబెట్టేసి ఉంటుందంటూ మహానటి కామెంట్స్..!
Keerthy Suresh | ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో తన ప్రేమాయణం ఎలా మొదలైంది? ఇంట్లో ఈ విషయం ఎలా తెలిసింది? మతాంతర వివాహానికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వంటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Keerthy Suresh | ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో తన ప్రేమాయణం ఎలా మొదలైంది? ఇంట్లో ఈ విషయం ఎలా తెలిసింది? మతాంతర వివాహానికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వంటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా తన వ్యక్తిగత డైరీ కారణంగానే ప్రేమ వ్యవహారం ఇంట్లో బయటపడిందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్ తన ప్రేమ ప్రయాణం ప్లస్ టూ పూర్తయిన తర్వాత ప్రారంభమైందని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో తనకు డైరీ రాసే అలవాటు ఉండేదని, అందులో ఆంటోనీతో తన ప్రేమకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాసుకునేదాన్నని తెలిపారు.
అయితే ఒకరోజు తన తల్లి, సీనియర్ నటి మేనక ఆ డైరీని చదవడంతో అసలు విషయం బయటపడిందని గుర్తుచేసుకున్నారు. తల్లి తన డైరీ చదవడంపై కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లిగా తన డైరీ చదివే హక్కు ఉందని మేనక చెప్పారని, ఆ సంఘటన తర్వాత తాను డైరీ రాయడం పూర్తిగా మానేశానని తెలిపారు. ఇప్పటికీ ఆ డైరీ ఎక్కడ ఉందో తనకు తెలియదని, బహుశా అమ్మ దాన్ని తగలబెట్టి ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆ పాత డైరీ మళ్లీ తనకు దొరికితే బాగుంటుందని మనసులోని కోరికను బయటపెట్టారు.
కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ పరిచయం 2009 డిసెంబర్లో జరిగింది. ఆ తర్వాత 2010 జనవరి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది. అప్పటికి కీర్తి వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఆంటోనీ ఆమె కంటే ఏడేళ్లు పెద్దవారు. ఆయన ఖతార్‌లో ఉద్యోగం చేయడంతో వీరిద్దరూ చాలా కాలం దూరంగా ఉంటూనే తమ ప్రేమ బంధాన్ని కొనసాగించారు. అయితే వీరి పెళ్లి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కీర్తి హిందూ కుటుంబానికి చెందినవారు కాగా, ఆంటోనీ క్రైస్తవ మతానికి చెందినవారు కావడంతో ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని కీర్తి వెల్లడించారు. తాను సినిమాల్లోకి రాకముందే ఆంటోనీకి పరిచయం ఉందని, ఇద్దరూ కలిసి జీవితంలో ఎదుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకున్నామని తెలిపారు.
సినిమా రంగంలో స్టార్ హీరోయిన్గా ఎదిగినప్పటికీ కీర్తి తన ప్రేమ విషయాన్ని చాలా ఏళ్లపాటు రహస్యంగానే ఉంచారు. దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన ఈ ప్రేమ ప్రయాణాన్ని 2024 నవంబర్‌లో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. దీపావళి సందర్భంగా ఆంటోనీతో కలిసి ఉన్న ఫొటోను పంచుకోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో 2024 డిసెంబర్ 12న గోవాలో కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ వివాహం చేసుకున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో వివాహ వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | డైరీతో బయటపడిన కీర్తి సురేష్ ప్రేమాయణం.. అమ్మ తగలబెట్టేసి ఉంటుందంటూ మహానటి కామెంట్స్..!
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

