అనతికాలంలోనే తారపథంలో దూసుకుపోతున్నది అస్సామీ సోయగం కయాదు లోహర్. డ్రాగన్, ఫంకీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’లో నాని సరసన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె తమిళంలో మరో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అగ్ర హీరో అజిత్ 64వ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీనికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో కయాదు లోహర్ నటించనున్నట్లు తెలిసింది. కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇదిలావుండగా సూర్య 48వ చిత్రంలో కూడా కయాదులోహర్ నాయికగా నటిస్తున్నది.