అగ్ర హీరో అల్లు అర్జున్ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలంటూ బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ టీమ్ ఖండించడంతో పాటు నిరాధారమైన ఈ కామెంట్స్‌పై లీగల్ నోటీస్ జారీ చేస్తామని హెచ్చరించింది. తాజాగా కావేరి బరువా.. అల్లు అర్జున్‌కు క్షమాపణలు చెప్పారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
పాడ్‌కాస్ట్ సందర్భంగా తన మాటల్లో తప్పులు దొర్లాయని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని, తన వల్ల అల్లు అర్జున్ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్లు తెలుసుకొని క్షమాపణలు కోరుతున్నానని కావేరి బరువా పేర్కొన్నది. అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలను పాటించాలని, ఆయన మేనేజర్లు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని పాడ్‌కాస్ట్‌లో కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె క్షపమాణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసినట్లయింది.