Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Katrina Kaif | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన శరీరాకృతిపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ప్రసవం తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని, అలాంటి సమయంలోనూ పాత రూపంతో పోలుస్తూ విమర్శించడం సరైంది కాదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
Katrina Kaif | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన శరీరాకృతిపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ప్రసవం తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని, అలాంటి సమయంలోనూ పాత రూపంతో పోలుస్తూ విమర్శించడం సరైంది కాదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన జీవితంలోని అందమైన దశను ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలు వెంటనే మునుపటి శరీరాకృతికి తిరిగి రావాలనే ఒత్తిడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ ఇటీవల అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ చతుర్థి వేడుకలకు హాజరయ్యారు. తల్లి అయిన తర్వాత చాలా కాలానికి ఆమె బహిరంగంగా కనిపించడంతో ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే కొందరు నెటిజన్లు ఆమె ప్రస్తుత రూపాన్ని గతంలో ఉన్న రూపంతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రసవం తర్వాత బరువు పెరిగారంటూ విమర్శలు చేయడంతో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. కత్రినాకు మద్దతుగా పలువురు ప్రముఖులు, అభిమానులు నిలిచారు. ప్రసవం తర్వాత శరీరంలో వచ్చే మార్పులు సహజమని, వాటిని విమర్శలకు కారణంగా మార్చకూడదని అభిప్రాయపడ్డారు. తాజాగా కత్రినా సైతం ఈ విమర్శలపై స్పందిస్తూ తన ఆలోచనలను పంచుకున్నారు.
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో వచ్చే మార్పుల గురించి చాలామందికి అవగాహన ఉంటుందని కత్రినా పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు అలాంటి మార్పులను విమర్శించాలని నిర్ణయించుకుంటే అది వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఇతరుల అభిప్రాయాల కోసం తన జీవితంలోని ముఖ్యమైన దశను పక్కన పెట్టబోననే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. ప్రసవం తర్వాత మహిళలు వీలైనంత త్వరగా గతంలో ఉన్న శరీరాకృతికి తిరిగి రావాలనే భావనపై కూడా కత్రినా స్పందించారు. ‘బౌన్స్ బ్యాక్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ, తన జీవితంలోని ఈ అందమైన దశను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలనుకుంటున్నట్లు తెలిపారు. తన మనసులో ఎప్పటినుంచో ఉన్న ఒక బలమైన కోరికను నెరవేర్చుకుంటూ జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టానని, అలాంటప్పుడు మళ్లీ వెనక్కి వెళ్లాలని ఎందుకు అనుకోవాలని ప్రశ్నించారు. తన ఫిట్నెస్ ప్రయాణంపై తనకు అవగాహన ఉందని, తన శరీరం ఎప్పుడు చురుగ్గా ఉంటుందో కూడా తెలుసని ఆమె పేర్కొన్నారు. ఇతరులు చేసే వ్యాఖ్యల కంటే తన జీవితంలోని ప్రస్తుత ఆనందానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె మాటలు సూచిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

