Sapathami Gowda | బంపర్ ఆఫర్ కొట్టేసిన కాంతార హీరోయిన్.. స్టార్ దర్శకుడి సినిమాలో అవకాశం..!
సినీ రంగంలో కథానాయికలకు మంచి గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో ఎక్కడలేని పాపులారాటీ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సప్తమీ గౌడ ఒకరు.
Actress Sapathami Gowda | సినీ రంగంలో కథానాయికలకు మంచి గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సప్తమీ గౌడ ఒకరు. ‘పాప్ కార్న్ మంకీ టైగర్’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతో కన్నడిగుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘కాంతార’తో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో లీల పాత్రలో ఒదిగిపోయింది. అందం, అమాయకత్వం, చలాకీ తనం కలగలిసిన పాత్రలో నటించి అందరి మెప్పు పొందింది. ఈ సినిమాతో సప్తమీ గౌడకు క్రేజ్‌తో పాటు అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.
కాగా తాజాగా ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ తగిలింది. ‘ది కాశ్మీరీ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రీ దర్శకత్వం వహిస్తున్న ‘ది వాక్సిన్ వార్’ సినిమాలో ఈ అమ్మడు ఎంపికైంది. ఇక ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర కోసం సప్తమీ గౌడను మేకర్స్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. అనుపమ్ ఖేర్, నానా పటేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా మూడో సినిమాకే సప్తమీకి బాలీవుడ్ ఆఫర్ వరించడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ క్రేజ్ మరింత పెరుగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీనితో పాటు సప్తమీ గౌడ ఓ కన్నడ సినిమాలోనూ నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

