ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తనయుడు ప్రజ్వల్ దేవరాజ్ కథానాయకుడిగా రూపొందనున్న చిత్రం ‘జాతర’. నందనవనమ్ దర్శకుడు. గోవర్ధన్ రెడ్డి నిర్మాత. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న వైవిధ్యమైన ప్రేమకథ ఇది. లవ్‌స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది.
ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభించి సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో