Kamal Haasan | ఆయన్ని డైరెక్ట్ చేయడమంటే యూనివర్సిటీకి పాఠాలు చెప్పడమే!
‘చేయాల్సిన ప్రయోగాలన్నీ ముందే చేసేస్తే, కొత్తగా చేయటానికి ఏముంటుంది?’ కమల్‌హాసన్ కెరీర్ విషయంలో సినీ మేధావుల అభిప్రాయమిది. నిజానికి కమల్ రీసెంట్ బ్లాక్బాస్టర్ ‘విక్రమ్' కూడా ఆయనకు కొత్త పాత్రేం కాదు. గతంలో అలాంటివి ఎన్నో చేశారాయన.
‘చేయాల్సిన ప్రయోగాలన్నీ ముందే చేసేస్తే, కొత్తగా చేయటానికి ఏముంటుంది?’ కమల్‌హాసన్ కెరీర్ విషయంలో సినీ మేధావుల అభిప్రాయమిది. నిజానికి కమల్ రీసెంట్ బ్లాక్బాస్టర్ ‘విక్రమ్’ కూడా ఆయనకు కొత్త పాత్రేం కాదు. గతంలో అలాంటివి ఎన్నో చేశారాయన. కథ పాతదైనా కొత్తగా చెప్పటం, పాత్ర పాతదైనా కొత్తగా డిజైన్ చేయడం, ఇదే కమల్ విషయంలో దర్శకులు చేయాల్సిన పని. ప్రస్తుతం కమల్ స్క్రిప్ట్‌పైనే కిందామీదా పడుతున్నాడు దర్శకుడు హెచ్.వినోద్.
తమిళంలో ‘చతురంగ వేైట్టె’ లాంటి విభిన్నమైన సినిమాకు దర్శకత్వం వహించి, కార్తీతో ‘ఖాకీ’ లాంటి విజయాన్ని అందుకున్న వినోద్, త్వరలోనే కమల్‌హాసన్‌కి ‘యాక్షన్’ చెప్పనున్నారు. కమల్ డేట్స్ ఇచ్చినప్పట్నుంచీ దాదాపు మూడేళ్లుగా ఈ కథపైనే కసరత్తులు చేస్తున్నారు వినోద్. ఈ లోపు ‘విక్రమ్’ వచ్చేసింది.
మరోవైపు ‘భారతీయుడు-2’ కూడా విడుదలకు రెడీ అయిపోతున్నది. వినోద్ లేట్ చేస్తున్న కారణంగా పాన్ ఇండియా మూవీ ‘కల్కి’కి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ వెనుకే మణిరత్నం కూడా రెడీగా ఉన్నాడు. అందుకే ఇక ఆలస్యం మంచిదికాదని కథని లాక్ చేసేశాడంట వినోద్.. ‘కల్కి’ తర్వాత కమల్ చేసే సినిమా ఇదేనని టాక్. ‘కమల్ హాసన్‌గారి కెరీర్లో పూర్తి విభిన్నమైన కథ అని చెప్పను. ఆయన చేయని పాత్ర లేదు. చెప్పని కథలేదు. ఆయన్ని దర్శకత్వం చేయడమంటే యూనివర్సిటీకి పాఠాలు చెప్పటమే. అందుకే తిప్పలు పడుతున్నాను’ అన్నారు దర్శకుడు విజయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

