‘కల్కి’తో దీపికా రికార్డు
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కల్కి’ చిత్రం వెండితెరపై ఓ సరికొత్త ప్రపంచాన్ని సాక్షాత్కరింపజేస్తూ విజువల్ వండర్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నది. తొలి రెండు రోజుల్లో 298కోట్ల కలెక్షన్స్ సాధించి లాంగ్న్‌ల్రో వెయ్యికోట్ల మార్క్‌ను దాటొచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నది.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కల్కి’ చిత్రం వెండితెరపై ఓ సరికొత్త ప్రపంచాన్ని సాక్షాత్కరింపజేస్తూ విజువల్ వండర్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నది. తొలి రెండు రోజుల్లో 298కోట్ల కలెక్షన్స్ సాధించి లాంగ్న్‌ల్రో వెయ్యికోట్ల మార్క్‌ను దాటొచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నది.
ఈ సినిమాలో సుమతి పాత్రలో దీపికా పడుకోన్ అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ‘కల్కి’ చిత్రం ద్వారా దీపికా పడుకోన్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీపికా సినీ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ నిలిచింది. ఇప్పటివరకు హిందీలో యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ చిత్రాలతో పాటు రోహిత్‌శెట్టి కాప్ యూనివర్స్ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది దీపికా పడుకోన్.
అయితే ఈ చిత్రాలను అధిగమిస్తూ తొలి రోజు అత్యధిక వసూళ్లతో ‘కల్కి’ రికార్డు సృష్టించింది. గత ఏడాది దీపికా పడుకోన్ నటించిన ‘పఠాన్’ చిత్రం తొలి రోజు 106కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తాజాగా ‘కల్కి’ తొలి రోజు 191 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. తన కెరీర్లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ దీపికా పడుకోన్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఇదిలావుండగా భారతీయ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ (223 కోట్లు), బాహుబలి-2 (231 కోట్లు) చిత్రాలు తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలవగా, ఇప్పుడు మూడోస్థానంలో ‘కల్కి’ ఉండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

