Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ప్రస్తుతం ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మే 09న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన దీని గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇదిలావుంటే మహాశివరాత్రి కానుకగా మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నాం అంటూ మేకర్స్ రాసుకోచ్చారు. ఇక పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు. ఫ్యుచర్ స్టైల్ గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్ .. కండలు తిరిగిన దేహంపై టాటూ, పోనీటైల్ హెయిర్.. వేరే లెవల్ ల్లో ఉన్నాడు.
From the future streets of Kasi, Introducing ‘BHAIRAVA’ from #Kalki2898AD.#Prabhas #Kalki2898ADonMay9@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @shreyasgroup pic.twitter.com/2hFB6PWk27
— Shreyas Media (@shreyasgroup) March 8, 2024