Aamir Khan | అమ్మాయిల ఎంపికలో అమీర్‌కు మంచి టేస్ట్ ఉంది .. మాజీ భార్య ముందే కాజోల్ సెటైర్లు
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కెరీర్లోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ‘లగాన్’ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ‘లగాన్’ సిల్వర్ జూబ్లీ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కెరీర్లోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ‘లగాన్’ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ‘లగాన్’ సిల్వర్ జూబ్లీ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో కాజోల్, జూహీ చావ్లా చేసిన సరదా వ్యాఖ్యలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, జావేద్ అక్తర్, కాజోల్, జూహీ చావ్లా తదితర ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన కాజోల్, అమీర్ ఖాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించాయి. అమీర్ ఖాన్ సినిమాల ఎంపిక చూస్తే ఆయనకు ఎంత మంచి అభిరుచి ఉందో తెలుస్తుంది. ‘లగాన్’తో ప్రారంభమైన ఆయన ప్రొడక్షన్ ప్రయాణం ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. సినిమాల్లో మాత్రమే కాదు, మహిళల ఎంపికలో కూడా అమీర్‌కు చాలా మంచి టేస్ట్ ఉంది అంటూ కాజోల్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అమీర్ ఖాన్ కూడా నవ్వారు.
మరోవైపు జూహీ చావ్లా కూడా తనదైన శైలిలో అమీర్‌పై సరదా పంచులు విసిరారు. అమీర్ గురించి చెప్పాలంటే ఒక సాయంత్రం కూడా సరిపోదు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రారంభం కాకముందు నుంచే నాకు తెలుసు. నా పక్కన నటించిన వాళ్లందరూ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయారు, చూశారా! అంటూ నవ్వులు పూయించారు. ఈ సరదా సంభాషణల సమయంలో అమీర్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు కూడా అక్కడే ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో కాజోల్, జూహీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై కూడా ప్రస్తుతం బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. రీనా దత్తాతో విడిపోయిన తర్వాత కిరణ్ రావును వివాహం చేసుకున్న అమీర్, 2021లో ఆమెతో కూడా విడిపోయారు.
అయితే ఇద్దరూ కలిసి తమ కుమారుడు ఆజాద్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తన భాగస్వామి గౌరీ స్ప్రట్‌తో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ‘లగాన్’ 25 ఏళ్ల సందర్భంగా చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. 2001లో విడుదలైన ఈ చిత్రం బ్రిటీష్ పాలనలో భారతీయులపై విధించిన పన్నులు, వాటి చుట్టూ తిరిగే క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో రూపొందింది. విడుదలైన సమయంలో సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నేటికీ భారతీయ సినీ చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

