Kaikala Satyanaraya | మహా ప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు.. తరలి వచ్చిన సినీ, రాజకీయ లోకం..!
నవరస నటసార్యభౌముడు కైకాల సత్యనారాయణ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నెట్టేసింది. గత కొంత కాలంగా వయో సంబంధిత సమ్యసలతో బాధపడుతున్న కైకాల.. శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు.
Kaikala Satyanaraya Last Rites | నవరస నటసార్యభౌముడు కైకాల సత్యనారాయణ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నెట్టేసింది. గత కొంత కాలంగా వయో సంబంధిత సమ్యసలతో బాధపడుతున్న కైకాల.. శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. కృష్ణంరాజు, సూపర్ కృష్ణ మరణ వార్తలు మరవకముందే మరో దిగ్గజ నటుడు కాలం చెందటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.
కైకాల అంత్యక్రియలు జూబ్లిహిల్స్లోని మహాప్రస్థానంలో జరుగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. నటుడిగా సినీ పరిశ్రమకు, ఎంపీగా ప్రజలకు సత్యనారాయణ చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అందుకోసం పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

