సుదీప్ నటించిన కన్నడ చిత్రం ‘కోటిగొబ్బా’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని ‘కే3 కోటికొక్కడు’ పేరుతో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రీనివాస్, దేవేంద్ర డీకే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘తెలుగు ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. త్వరలోమూడు పాటల్ని విడుదల చేయబోతున్నాం. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. సుదీప్ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా ఉంటాయి’ అని చిత్రబృందం పేర్కొంది. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ చంద్రు, సంగీతం: అర్జున్ జెన్యా, దర్శకత్వం: శివ కార్తీక్.