Jurassic World Rebirth | ‘జూరాసిక్ వరల్డ్ రీబర్త్’ నుంచి కొత్త ట్రైలర్
Jurassic World Rebirth Trailer | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) రూపొందించిన జూరాసిక్ పార్క్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Jurassic World Rebirth Trailer | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) రూపొందించిన జూరాసిక్ పార్క్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు యాక్షన్, లవ్ స్టోరీ, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీస్తున్న హాలీవుడ్‌కి, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ అనే కొత్త జానర్‌ను స్టీవెన్ పరిచయం చేశారు. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీలో ఏడు సినిమాలు విడుదలై బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి మరో కొత్త సినిమా రాబోతోంది.
‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహన్సన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జూలై 04న తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం, హిందీతో సహా ఇతర భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. అంతరించిపోయిన డైనోసార్ల DNA నమూనాలతో వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించేందుకు ఒక బృందం ప్రమాదకరమైన మిషన్ చేపడుతుంది. అయితే ఆ బృందానికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అయితే వాటినుంచి ఆ టీమ్ ఎలా బయటపడిందనే కథతో ఈ మూవీ రాబోతుంది. ఈ చిత్రం యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అంశాలతో అలరించనుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

