War 2 Movie | ముంబై ఎయిర్ పోర్ట్లో ఎన్టీఆర్.. కొత్త లుక్ అదిరిపోయిందిగా
Jr NTR | టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సినిమాల కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఆ తరువాత 2023లో అసలే కనిపించలేదు.
Jr NTR | టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సినిమాల కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఆ తరువాత 2023లో అసలే కనిపించలేదు. ఇక ఈ ఏడాది దేవరతో ఎన్టీఆర్ సందడి చేయనుండగా.. ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలు మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో తారక్ నెగటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు. అయితే తారక్ ముంబై ఎయిర్పోర్ట్లో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
All Hail The Tiger 🐯 😎🤍🔥. #JrNTRpic.twitter.com/33xGoBc2Lm
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) April 22, 2024
ఇక ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

