War 2 | హృతిక్, తారక్ మధ్య డ్యాన్సింగ్ వార్
దేవర’ హడావిడి ప్రస్తుతానికి ముగిసింది. ఇప్పుడు తారక్ దృష్టి అంతా ‘వార్ 2’ మీదే. అందుకే.. లుక్ మార్చేశాడు. రీసెంట్గా ‘వార్ 2’కోసం ముంబై ఫ్లయిట్ ఎక్కేశాడు. ఈ కొత్త షెడ్యూల్లో హృతిక్, తారక్‌లపై ఓ పాటను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారట.
War 2 | ‘దేవర’ హడావిడి ప్రస్తుతానికి ముగిసింది. ఇప్పుడు తారక్ దృష్టి అంతా ‘వార్ 2’ మీదే. అందుకే.. లుక్ మార్చేశాడు. రీసెంట్గా ‘వార్ 2’కోసం ముంబై ఫ్లయిట్ ఎక్కేశాడు. ఈ కొత్త షెడ్యూల్లో హృతిక్, తారక్‌లపై ఓ పాటను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారట. హృతిక్, తారక్ ఇద్దరూ గొప్ప డ్యాన్సర్సే. అందుకే.. అబ్బురపరిచే డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ పాటను డిజైన్ చేశారట. ప్రస్తుతం ముంబైలో ఈ పాట షూటింగ్ జరుగుతున్నది. డ్యాన్స్ లవర్స్ పండుగ చేసుకునేలా ఈ పాట ఉండబోతున్నదని టాక్. ఇప్పటికే తారక్, హృతిక్‌లపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని కూడా పూర్తి చేశారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
వచ్చే ఏడాది ఆగస్ట్ 14న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు ‘యుద్ధభూమి’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తాజా సమాచారం. పాన్ ఇండియా సినిమాలు ఒకే టైటిల్‌తో అన్ని భాషల్లో విడుదల అవుతున్న రోజులివి. అయితే.. తారక్‌ది ఇందులో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ కాబట్టి, ఆయన్ను దృష్టిలో పెట్టుకొని తెలుగు టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారనేది బీటౌన్ టాక్. నిజానికి ‘యుద్ధభూమి’ ఇక్కడ కొత్త టైటిలేం కాదు. గతంలో చిరంజీవి హీరోగా ఇదే పేరుతో ఓ సినిమా వచ్చింది. ‘వార్ 2’ అనేది కూడా యూనివర్సల్ టైటిల్. ఫైనల్‌గా అదే ఖరారయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

