Jr NTR | గ్రాఫిక్స్‌కే వందకోట్లు?
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పెంచింది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అభిమానుల్లో అంచనాల్ని మరింతగా పెంచింది. తీర ప్రాంత నేపథ్య కథతో హై ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషన్స్‌తో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత శక్తివంతంగా సాగుతుందని, ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
ఈ సినిమా మేకింగ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. కథానుగుణంగా గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యత ఉందని…ఆ హంగుల కోసమే వందకోట్లు వెచ్చించబోతున్నారని సమాచారం. ఈ సినిమా మేకింగ్ విషయంలో అన్కాంప్రమైజ్డ్గా ఉండాలని, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది నిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

