Chiranjeevi | శేఖర్ మాస్టర్‌తో జానీ మాస్టర్‌కి గొడవలా.. చిరంజీవి సమక్షంలో పుకార్లకు ఫుల్ స్టాప్!
Chiranjeevi | తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సమావేశంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఈ వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందని పలు కథనాలు వెలువడ్డాయి.
Chiranjeevi | తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ సమావేశంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఈ వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందని పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాలపై తాజాగా జానీ మాస్టర్ స్వయంగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు. జానీ మాస్టర్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేస్తూ, శేఖర్ మాస్టర్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా నాకు, శేఖర్ మాస్టర్ అన్నకు మధ్య గొడవలు జరిగాయంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. మేమంతా ఒకే కుటుంబంలా ఉంటాం. ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటాయి అని జానీ మాస్టర్ తెలిపారు. ఈ సందేహాలకు తెరదించేందుకు జానీ మాస్టర్, మెగాస్టార్ చిరంజీవి, శేఖర్ మాస్టర్‌తో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. షూటింగ్ సెట్స్‌లో ముగ్గురూ కలిసి చిరునవ్వులతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. జానీ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పుకార్ల గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇద్దరినీ పిలిచి మాట్లాడారు. అనంతరం ముగ్గురూ కలిసి సరదాగా ముచ్చటించి, కలిసి భోజనం కూడా చేశారు.
చిరంజీవి గారు మాపై చూపించే ప్రేమ, ఆప్యాయత, మార్గదర్శకత్వం ఎప్పటికీ మాకు గొప్ప బలం. మేమంతా కలిసి ఎంతో సంతోషంగా సమయం గడిపాం. దయచేసి ఎలాంటి ఆధారాలు లేని వార్తలను నమ్మకండి, ప్రచారం చేయకండి అంటూ జానీ మాస్టర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల అంశాలపై కొన్ని విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఫెడరేషన్ అనుమతి లేకుండా ఉప ఎన్నికలు నిర్వహించాలనే అంశం చర్చకు దారితీసిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అసోసియేషన్‌కు జానీ మాస్టర్ సతీమణి సుమలత (ఆయిషా) అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై అసోసియేషన్ సభ్యుల్లో అసంతృప్తి ఉందని, కొందరు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
A few misleading videos and false reports have been doing the rounds over the last couple of days….
I want to make this clear… there is absolutely no misunderstanding or conflict between me and Shekar Master Anna. We are one family and we have always stood by each other.… pic.twitter.com/oCOsngCtwI
— Jani Master (@AlwaysJani) July 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

