Janaganamana | ‘జనగణమన’ షూటింగ్ ప్రారంభం.. సెట్లో జాయిన్ అయిన పూజాహెగ్డే!
Pooja Hegde Joined The Janagamana Shooting | ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న కథానాయిక పూజాహెగ్డే. గతేడాది వరుస హిట్లతో జోరుమీదున్న పూజా ఈ ఏడాది మాత్రం వరుస ఫ్లాప్‌లతో కాస్త నిరాశలో ఉంది. కానీ ఈవిడ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వరుస ఫ్లాప్‌లు వచ్చిన సరే అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో విజయ్ దేవరకొండ ‘జనగణమన’ ఒకటి. అయితే ఇప్పటివరకు ఈ చిత్రంలో పూజా హీరోయిన్గా నటించనున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ‘జనగణమన’ షూటింగ్ ప్రారంభమైనట్లు.. పూజా షూటింగ్లో పాల్గొన్నట్లు ట్విటర్లో తెలిపారు.
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శనివారం ముంబైలో ప్రారంభమైంది. ఈ షూటింగ్లో పూజా హెగ్డే పాల్గొంది. ఈ షెడ్యూల్లో పూజాహెగ్డేపై సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. పూజా హెగ్డే యాక్షన్ పాత్రలో నటించనుంది. ఇది వరకే చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై పూరి, చార్మీ లతో కలిసి వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పూజా బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, సల్మాన్‌ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాళి’ చిత్రాలలో నటిస్తుంది. వీటితో పాటుగా మహేష్‌బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటించనుంది.
JGM SHOOT BEGINS 🎬
Welcoming @hegdepooja on Board ✨@TheDeverakonda – #PuriJagannadh #JGM 🇮🇳
WW Release on AUG 3rd 2023@Charmmeofficial @directorvamshi @PuriConnects #SrikaraStudios @IamVishuReddy pic.twitter.com/JpsPrRSSYg
— Puri Connects (@PuriConnects) June 4, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

