Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తాను చాటుకున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై తొలి రోజే వసూళ్ల సునామీ సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల నివేదికలు చెబుతున్నాయి.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తాను చాటుకున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై తొలి రోజే వసూళ్ల సునామీ సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల నివేదికలు చెబుతున్నాయి. 2023లో వచ్చిన ‘జైలర్’కు కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో రజనీకాంత్ క్రేజ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సాక్నిల్క్ నివేదిక ప్రకారం.. ‘జైలర్ 2’ భారతదేశంలో తొలి రోజు రూ.70.25 కోట్ల గ్రాస్, రూ.59.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 16,599 షోలు ప్రదర్శించగా, దాదాపు 37.46 లక్షల మంది ప్రేక్షకులు సినిమాను వీక్షించినట్లు నివేదిక పేర్కొంది.విదేశీ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించినట్లు సమాచారం. ఓవర్సీస్ నుంచి తొలి రోజే రూ.55 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అంచనా. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు రూ.125.25 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ గణాంకాలు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ‘జైలర్ 2’కు తమిళనాడులో భారీ స్పందన లభించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తమిళ వెర్షన్ సుమారు 9,326 షోలతో 70.8 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసి రూ.43.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. రజనీకాంత్‌కు స్వస్థలమైన తమిళ మార్కెట్లో ఉన్న ఆదరణ ఈ గణాంకాల్లో మరోసారి కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 2,792 షోలతో 56.2 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసి రూ.12.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు నివేదిక పేర్కొంది. హిందీ వెర్షన్ రూ.3.50 కోట్ల నెట్, కన్నడ వెర్షన్ రూ.35 లక్షల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. రజనీకాంత్ గత చిత్రం ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.151.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ‘జైలర్ 2’ రూ.125.25 కోట్ల ఓపెనింగ్‌తో ఆయన కెరీర్లో రెండో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచినట్లు సమాచారం. 2023లో విడుదలైన మొదటి ‘జైలర్’ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.48.35 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా. దానితో పోలిస్తే సీక్వెల్‌కు వచ్చిన భారీ ఓపెనింగ్ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. తొలి రోజు భారీ వసూళ్లు సాధించినట్లు వస్తున్న నివేదికలతో ‘జైలర్ 2’ తదుపరి రోజుల్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనే ఆసక్తి నెలకొంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

