Jabardasth Praveen | అట్టహాసంగా జరిగిన జబర్దస్త్ ప్రవీణ్ పెళ్లి.. వైరల్ అవుతున్న హల్దీ వేడుకల ఫోటోలు!
Jabardasth Praveen | బుల్లితెర కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జబర్దస్త్, పటాస్ వంటి ప్రముఖ షోలతో ప్రేక్షకులను అలరించిన ప్రవీణ్ తాజాగా తన ప్రియురాలు కడెం వంశితతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గత కొంతకాలంగా నటి, డ్యాన్సర్ అయిన వంశితతో ప్రేమలో ఉన్న ప్రవీణ్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
Jabardasth Praveen | బుల్లితెర కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జబర్దస్త్, పటాస్ వంటి ప్రముఖ షోలతో ప్రేక్షకులను అలరించిన ప్రవీణ్ తాజాగా తన ప్రియురాలు కడెం వంశితతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గత కొంతకాలంగా నటి, డ్యాన్సర్ అయిన వంశితతో ప్రేమలో ఉన్న ప్రవీణ్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీరి పెళ్లి కూడా సింపుల్‌గా, కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఓ ఆలయంలో ఘనంగా జరిగింది.
ఇక తాజాగా ప్రవీణ్ భార్య వంశిత తమ హల్దీ వేడుకలకు సంబంధించిన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. పసుపు రంగు దుస్తుల్లో సంప్రదాయ లుక్‌లో మెరిసిపోయిన ఈ జంట ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హల్దీ వేడుకల్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సందడి, ఆనంద క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, బుల్లితెర అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “మేడ్ ఫర్ ఈచ్ అదర్”, “చాలా క్యూట్ కపుల్”, “హ్యాపీ మ్యారెడ్ లైఫ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రవీణ్ ఇప్పుడు తన రియల్ లైఫ్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జబర్ధస్త్ ప్రవీణ్ గతంలో ఫైమాతో ప్రేమాయణం నడుపుతున్నాడని త్వరలో వారిద్దరు పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నారని వార్తలు వచ్చాయి. కాని ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే రీసెంట్గా ఫైమా తన సోషల్ మీడియాలో ప్రవీణ్ పెళ్లి నాడు వీడియో కాల్ చేసి విష్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

