Puri Jagannadh | జనగణమన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదట.. విజయ్ ప్లేస్‌లో మరో హీరో రానున్నాడట..!
Janaganamana Movie | పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్ట్ జనగణమన సినిమాకు మోక్షం మాత్రం కలగడం లేదు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట మహేష్‌తో చేయాలని రాసుకున్న కథ.. అలాగే ఓ మూలన పడి ఉంది.
Janaganamana Movie | పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్ట్ జనగణమన సినిమాకు మోక్షం మాత్రం కలగడం లేదు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట మహేష్‌తో చేయాలని రాసుకున్న కథ.. అలాగే ఓ మూలన పడి ఉంది. పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత మహేష్‌తో మరో సినిమా చేయాలని పూరి జనగణమన కథను రాసుకున్నాడు. టైటిల్‌ను కూడా రిజస్టర్ చేయించాడు. అయితే మహేష్‌తో ఈ సినిమా తీయాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు జరిపినా వర్కవుట్ అవలేదు. దాంతో ప్రతీ ఏటా ఆ టైటిల్‌ను రిన్యువల్ చేస్తూ వస్తున్నాడు. ఇక అన్ని కుదిరి రౌడీ స్టార్ విజయ్‌తో ఈ సినిమాను పట్టాలెక్కించాడు. లైగర్ చేస్తున్న టైమ్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూట్ కూడా చేశాడు.
యుద్ద విమానాలు, సైనికులు, మిస్సైల్స్, బుల్లెట్లతో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ దేశభక్తిని చాటి చెప్పే సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఇదే నెల 3వ తేదిన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తీరా లైగర్ ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేశారు. ఇక ఆ తర్వాత విజయ్ ఖుషీలో బిజీ అవగా.. ఈ మధ్యనే పూరి డబుల్ ఇస్మార్ట్‌ను స్టార్ చేశాడు. కాగా తాజాగా జనగణమన సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట సందడి చేస్తుంది. ఈ సినిమా అందరూ అనుకున్నట్లు క్యాన్సిల్ అవ్వలేదట. లేట్‌గా మొదలవ్వచ్చేమో గానీ పక్కాగా సినిమా ఉంటుందని టాక్. అయితే విజయ్ ప్లేస్‌లో మరో హీరో ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

