Irumudi | మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రీమియర్ షోలు చూసిన కొందరు ప్రేక్షకులు.. ‘ఇరుముడి’లో తండ్రి–కూతురు మధ్య బంధాన్ని శివ నిర్వాణ చాలా ఎమోషనల్‌గా చూపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఈ సినిమా ఆలోచింపజేస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా, ఒక సామాజిక అంశాన్ని కూడా సినిమాలో టచ్ చేశారని ప్రేక్షకులు చెబుతున్నారు. కుటుంబ సంబంధాలు, తల్లిదండ్రుల ఆలోచనా విధానం వంటి అంశాలను కథలో భాగంగా చూపించిన తీరు ఆకట్టుకుందని అంటున్నారు. సినిమా ఫస్టాఫ్ చాలా బాగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథను ఆసక్తికరంగా నడిపించడంతో పాటు, కొన్ని సన్నివేశాలు మంచి ఇంపాక్ట్ ఇచ్చాయని ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలకు సంబంధించిన సన్నివేశాలు బాగా కనెక్ట్ అయ్యాయని పలువురు పేర్కొంటున్నారు.
రవితేజ కెరీర్లో ఎమోషనల్ కంటెంట్‌తో గుర్తుండిపోయిన సినిమాల్లో ‘నా ఆటోగ్రాఫ్’ ఒకటి. తాజాగా ‘ఇరుముడి’ చూసిన కొందరు అభిమానులు.. ‘నా ఆటోగ్రాఫ్’ తర్వాత అంతటి ఫీలింగ్ ఇచ్చిన సినిమా ఇదే అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ కామెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే చిత్రంలో మల్లెపూల పల్లకి సాంగ్‌కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. మల్లెపూల పాట వచ్చిన సమయంలో ప్రేక్షకులు థియేటర్లో స్క్రీన్‌కి హారతులు ఇచ్చారు. కొందరు డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Swamy sharanam 🙏 #Irumudi pic.twitter.com/0Zlo9Mkz5G
— RTR (@natweetsnaistm) August 21, 2026