Ram Charan | సుజిత్ పెళ్లికి నన్నెందుకు పిలువలేదు..? ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించిన రాంచరణ్..!
Ramcharan | జహీరాబాద్‌లో జరిగిన సుజీత్ పెళ్లికి తనను ఎందుకు పిలువలేదంటూ గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దీనికి ఆయన పిలువకపోవడం తప్పేనంటూ స్పందించారు. ఇద్దరి మధ్య జరిగిన ట్వీట్ల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతకీ ఎవరీ సుజిత్ ? పెళ్లి ఎప్పుడు జరిగింది ? అంటూ పలువురు ఆరా తీస్తున్నారు.
Ram Charan | జహీరాబాద్‌లో జరిగిన సుజీత్ పెళ్లికి తనను ఎందుకు పిలువలేదంటూ గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దీనికి ఆయన పిలువకపోవడం తప్పేనంటూ స్పందించారు. ఇద్దరి మధ్య జరిగిన ట్వీట్ల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతకీ ఎవరీ సుజిత్ ? పెళ్లి ఎప్పుడు జరిగింది ? అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ఆశ్చర్యపోయారు. ఆ పెళ్లి వివరాలేంటో చూసేద్దాం రండి..!
ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్‌లో కొద్ది సంవత్సరాల కిందట ఇక్కడ ట్రాక్ట్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. కంపెనీ ఈ ప్రాంతంలో సామాజికంగా, పర్యావరణపరంగా అభివృద్ధి చేయాలని భావించింది. ఇందులో భాగంగా మహీంద్రా రైజ్ ఫౌండేషన్ లక్ష చెట్లు నాటింది. పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు తవ్వించింది. దాంతో ఆ ఈ ప్రాంతంలో భూగర్భ జలాల నీటిమట్టం 400 అడుగుల మేర పెరిగింది. గతంలో ఇక్కడ నీటి ఎద్దడితో యువతకు పెళ్లిళ్లు అయ్యేవి కావని.. ప్రస్తుతం నీటి మట్టం పెరగడంతో పెళ్లిళ్లు జరుగుతున్నాయని ‘సుజిత్’ పాత్ర పేరుతో వీడియోను కంపెనీ రూపొందించింది.
కంపెనీ తీసుకున్న చర్యలతో జహీరాబాద్ ప్రాంతంలో నీటిమట్టం పెరిగిందని, బ్రహ్మచారిగా ఉన్న సుజిత్‌కు పెళ్లయ్యిందంటూ వీడియోను మహీంద్రా రైజ్ రూపొందించింది. దీన్ని ఆనంద్ మహీంద్రా ఎక్స్(ట్వీట్) చేశారు. ఈ వీడియోను చూసిన రాం చరణ్ ‘జహీరాబాద్‌లో జరిగిన సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? నేనుండేది ఇక్కడికి దగ్గరలోనే కదా? జహీరాబాద్‌లో స్నేహితులను కలవడం సరదాగా ఉండేది. మహీంద్రా రైజ్ ఫౌండేషన్ తరపున జహీరాబాద్‌లో అద్భుతంగా కృషి చేశారు’ అంటూ పోస్ట్ చేయగా.. ఆనంద్ మహీంద్రా సైతం స్పందించారు.
‘నిన్ను పిలవకపోవడం తప్పేనని ఒప్పుకుంటున్నారు. గందరగోళంలో పడి నీకు ఆహ్వానం పంపడం మరిచిపోయాను. అన్నట్టు ఇటీవల నువ్వు నేర్పిన డ్యాన్స్ స్టెప్పులను పర్ఫెక్ట్గా నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాను. ఏదేమైనా మా సామాజిక సేవను గుర్తించి నీ వంతుగా ప్రోత్సాహకరమైన అభినందనలు తెలిపినందుకు కృతజ్ఞతలు. నీ ట్వీట్ కచ్చితంగా ఎంతో సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సారి ఎలాంటి పొరబాటు చేయను. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా నీకు ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఆనంద్ మహీంద్రా బదులిచ్చారు. మళ్లీ రాంచరణ్ కృతజ్ఞతలు తెలుపుతూ.. త్వరలోనే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా’నంటూ స్పందించారు.
I confess.
I messed up.
And missed sending you the invitation @AlwaysRamCharan !
I believe I was preoccupied with perfecting my dance moves based on your last lesson. 😅
But, many thanks for the shout-out! Makes a huge positive impact.
Let me not mess up & miss out… https://t.co/MBl55Eg47Q
— anand mahindra (@anandmahindra) March 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

