Indian-2 Movie | సేనాపతికి కాపీ అందింది.. ఇండియన్ -2 మూవీ నుంచి బిగ్ అప్డేట్
Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అటు శంకర్ కూడా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Changer)తో బిజీ అయ్యారు. రెండు సినిమాలకి ఈక్వల్‌గా కొన్నాళ్ళు పని చేశారు. అయితే కొన్నాళ్ళుగా ఎలాంటి అప్డేట్ లేకుండా వున్న ‘ఇండియన్ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో అడుగుముందుకు వేసింది.
తాజాగా ఈ సినిమా నుంచి రేపు ఉదయం 11 గంటలకు ఒక సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు శంకర్ ట్విట్టర్లో రాసుకోచ్చారు. దీనితో పాటు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ‘సేనాపతికి కాపీ అందింది’ అంటూ రాసుకోచ్చారు. ఇక అప్డేట్ ఎంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.
#Indian2 @ikamalhaasan @anirudhofficial @dop_ravivarman @LycaProductions #subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3 pic.twitter.com/Xc1oeHt8BM
— Shankar Shanmugham (@shankarshanmugh) October 28, 2023
కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. స్వర మాంత్రికుడు రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను రెడ్ జెయాంట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఇండిపెండెన్స్ డేకు రిలీజైన కమల్ లుక్కు విశేష స్పందన వచ్చింది. మరోవైపు విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్…ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

