‘తెలుగు సినిమాపై సీత కన్నేశారేంటి? అని ఇటీవల తాప్సీని ఓ తెలుగు అభిమాని అడిగితే – ‘నేనేం చెయ్యను. సరైన అవకాశాలు రావడంలేదు. అడపాదడపా వచ్చినా కథలేమో నచ్చట్లేదు. కథలు నచ్చకపోతే సినిమాలు చేయను’ అంటూ నిర్మొహమాటంగా సమాధానమిచ్చేసింది తాప్సీ. అన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు.
కమర్షియల్ హీరోలతో మాస్ సినిమాలు చేయరా? అనడిగితే ‘దీనికీ అదే నా సమాధానం. అవకాశాలు రావడంలేదు. వస్తే చేయటానికి అభ్యంతరం ఏముంటుంది? కాకపోతే నా వరకు ఆర్టిస్టుగా చిన్న సినిమాలే హాయిగా ఉన్నాయి. మీకు తెలియదనుకుంటా. నా సినిమాలకు తగ్గట్టే నా పారితోషికం కూడా ఉంటుంది. డబ్బు తక్కువ వచ్చినా అలాంటి సినిమాల్లో చేయటం వల్ల ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్నీ నేనే. నా చుట్టూనే కథ తిరుగుతుంది. నాకోసమే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. ఈ ఫీలింగ్ తెచ్చే ఆనందం మామూలుగా ఉండదు’ అంటూ తన మనసును ఆవిష్కరించింది తాప్సీ.