Allu Arjun | ‘ఫోర్బ్స్’ ఇండియా కవర్ పేజీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Allu Arjun Forbes India | జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సాధించారు. భారతదేశంలోని టాప్ 100 సెలబ్రిటీలను గౌరవిస్తూ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన 'ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026' ఎడిషన్ కవర్ పేజీపై ఆయన తళుక్కుమన్నారు.
ForbesIndia | జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సాధించారు. భారతదేశంలోని టాప్ 100 సెలబ్రిటీలను గౌరవిస్తూ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ‘ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన తళుక్కుమన్నారు. వినోద, క్రీడలు, పాపులర్ కల్చర్ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులతో రూపొందించిన ఈ ప్రత్యేక సంచికలో అల్లు అర్జున్ ముఖచిత్రంగా నిలవడం విశేషం. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమా సరిహద్దులను దాటి, దేశవ్యాప్తంగా ఓ పాన్-ఇండియా సాంస్కృతిక ప్రభంజనంగా మారిన ఆయన క్రేజ్‌కు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.
ఈ సంచిక సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. భారతీయ సినిమా ప్రస్తుత పరిస్థితిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ కావచ్చు, సౌత్ సినిమా కావచ్చు లేదా మరే ప్రాంతీయ సినిమా అయినా సరే సాధారణ కంటెంట్ ఇకపై ఎప్పటికీ వర్కౌట్ కాదని, గొప్ప కంటెంట్‌ను అందించడమే ప్రధానమని ఆయన పేర్కొన్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడంతో పాటు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతున్న అల్లు అర్జున్ ఈ ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీ ద్వారా తన స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. కాగా, ఇదే ‘షోస్టాపర్స్ 2026’ టాప్-100 జాబితాలో తెలుగు సినిమా నుంచి అల్లు అర్జున్‌తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా స్థానం సంపాదించుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

