Tina Shilparaj | టాలీవుడ్ యువ నటుడు సుహాస్ (suhas) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan). షణ్ముఖ ప్రశాంత్ (డెబ్యూ) డైరెక్షన్లో ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో టీనా శిల్పరాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ది బేకర్ అండ్ ది బ్యూటీ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది టీనా శిల్పరాజ్.
రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకుంది టీనా శిల్పరాజ్. రైటర్ పద్మభూషణ్ కామెడీ, సంతోషకరమైన భావోద్వేగపూరిత సన్నివేశాలతో ప్రేక్షకులకు ఫీల్ గుడ్ మూవీలా ఉండబోతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పింది. .
ఈ చిత్రంలో తాను విజయవాడ అమ్మాయి సారిక పాత్రలో కనిపిస్తానని చెప్పింది టీనా శిల్పరాజ్. రైటర్ పద్మభూషణ్ జీవితంలో సారిక కీలక పాత్ర పోషిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ సారిక పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుందని చెప్పుకొచ్చింది..
రైటర్ పద్మభూషణ్‌లో ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరి ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిలిమ్స్ -ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.