బాలీవుడ్ (Bollywood) టాలెంటెడ్ హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor). సినిమా సినిమాకు తన యాక్టింగ్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడీ యువ హీరో. తన కెరీర్లో చేసిన సినిమాల పట్ల తాను ఏ సందర్భంలో కూడా బాధపడనంటున్నాడు రణ్‌బీర్‌కపూర్. పీటీఐతో చిట్ చాట్ సెషన్లో రణ్‌బీర్ మాట్లాడుతూ..నేనెప్పుడూ స్పృహలో ఉంటాను..ఎందుకంటే సినిమాలతో సమాజంపై ప్రభావం పడుతుందన్నాడు.
వినోదం కోసం నేను ఏదైనా సరే చేయాలనుకోను..ఎవరినీ కించపరచను. అది నా వ్యక్తిత్వం. నేనిప్పటివరకు చేసిన సినిమాల పట్ల ఎప్పుడూ బాధపడలేదు. విజయాలెంత ముఖ్యమో ఫెయిల్యూర్స్ కూడా అంతే ముఖ్యమని నమ్ముతాను. నేను పిల్లల నుండి ‘పప్పా..అది మంచి సినిమా కాదు..’ ‘పప్పా..ఆ సినిమా చాలా సరదాగా ఉందని’ చెప్పడం వినడం సంతోషంగా భావిస్తున్నానన్నాడు రణ్‌బీర్ కపూర్.
రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో బ్రహ్మాస్త్ర (Brahmastra)సినిమా చేస్తున్నాడు. మల్టీస్టారర్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. మూడు పార్టులుగా బ్రహ్మాస్త్ర రాబోతుంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.