Case Registerd on RGV | ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ)పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఆర్జీవీ తన దగ్గర అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని శేఖర్‌రాజు అనే వ్యక్తి కూకట్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ‘దిశ’ సినిమా నిర్మాణానికి తన వద్ద రూ. 56 లక్షలు తీసుకున్నారని తెలిపారు. కానీ ఆ రూ.56 లక్షలు తిరిగి ఇవ్వకపోగా, ఆర్జీవీ తనను బెదిరించారని శేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారణ జరిపిన తర్వాత ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కూకట్పల్లి న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆర్జీవీపై ఐపీసీలోని 406, 407, 506 సెక్షన్ల కింద మియాపూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.