బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరు తమ టాలెంట్‌తో మెప్పిస్తున్నారు. వీరి పర్ఫార్మెన్స్కి కొందరు అభిమానులు కాగా, తాము మెచ్చిన కంటెస్టెంట్‌ని విజేతగా నిలిపేందుకు చాలా కృషి చేస్తున్నారు. సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి తమ సపోర్ట్ అందిస్తున్నారు. ప్రియాంక సింగ్‌కి నాగబాబు సపోర్ట్ అందించగా,సందీప్ కిషన్ తదితర స్టార్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి మద్దతుగా నిలవాలని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.
సీనియర్ నటి ప్రియకు గత సీజన్ బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్ మద్దతిస్తుండగా మానస్‌కు హీరో సందీప్ కిషన్ సపోర్ట్ చేస్తున్నాడు. తాజాగా ఆర్జే కాజల్‌కు మద్దతూ పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చింది హరితేజ. మాజీ కంటెస్టెంట్ అయిన హరితేజ.. కాజల్ కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి ఈ వారం నామినేషన్ నుండి సేవ్ చేయాలని కోరింది. కాజల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె టాప్ 5లో ఉంటుందని భావిస్తున్నాను అని హరితేజ తెలియజేసింది.