‘చిలసౌ’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది రుహాని శర్మ. ప్రస్తుతం ఈ భామ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హర్’ ఈ నెల 21న విడుదలకానుంది.
ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ అమ్మాయి హత్య కేసును పరిశోధిస్తున్న పోలీసాఫీసర్‌గా రుహాని శర్మ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగింది. ఈ సందర్భంగా రుహాని శర్మ మాట్లాడుతూ ‘ఇలాంటి శక్తివంతమైన పాత్ర కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాతో నా కల సాకారమైంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది’ అని చెప్పింది. ఆద్యంతం అనేక మలుపులతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే కథాంశమిదని చిత్ర దర్శకుడు శ్రీధర్ తెలిపారు.